వరల్డ్ నంబర్ వన్కు షాకిచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద

 వరల్డ్ నంబర్ వన్కు షాకిచ్చిన  గ్రాండ్ మాస్టర్  ప్రజ్ఞానంద

ఇండియన్ యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. పజ్ఞానంద   మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి  సంచలనం సృష్టించాడు.  2024 నార్వే చెస్ టోర్నమెంట్‌లో మూడో రౌండ్ తర్వాత ఈ యువ ఆటగాడు ఆధిక్యాన్ని సాధించాడు.   క్లాసికల్ చెస్ గేమ్‌లో కార్ల్‌సెన్‌పై  గ్రాండ్‌ మాస్టర్ సాధించిన  మొదటి విజయం .  పజ్ఞానంద    కెరీర్‌లో  ఇది ఒక కీలక  మైలురాయి.

క్లాసికల్ చెస్ లో  కార్ల్‌సెన్ కు గొప్ప ఆటగాడిగా పేరుంది. దశాబ్ధం నుంచి అతడిదే ఆధిపత్యం. ఇపుడు కార్ల్ సన్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు పజ్ఞానంద.  
మూడో రౌండ్‌లో తెల్ల పావులతో నార్వేజియన్‌ను మట్టికరిపించాడు.  అద్భుతమైన ఆట తీరుతో   ప్రత్యర్థిని అధిగమించి చివరికి ఓడించాడు.

ఈ విజయంతో పజ్ఞానంద ఇప్పుడు ఈవెంట్‌లో 5.5/9 పాయింట్లతో టాప్ లో ఉన్నాడు. ఈ ఓటమితో కార్ల్‌సెన్ ప్రస్తుత  పాయింట్ల పట్టికలో  మొదటి స్థానం నుండి ఐదవ స్థానానికి పడిపోయాడు.