అక్టోబర్ లో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తాం: సైంటిస్ట్ లు

అక్టోబర్ లో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి  తెస్తాం: సైంటిస్ట్ లు

అక్టోబర్, నవంబర్ నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సైంటిస్ట్ లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటింస్ట్ బృందానికి నాయకత్వం వహిస్తున్న యూకే చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలెన్స్ మాట్లాడుతూ వ్యాక్సిన్  అందుబాటులోకి రావాలంటే 12నెలల నుంచి 18నెలల సమయం పడుతుందని, కానీ అక్టోబర్, నవంబర్ నెలలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సైంటిస్ట్ లు నిర్విరామంగా పనిచేస్తున్నారని యూకే మీడియా సంస్థ ది సన్ కు  తెలిపారు.

ఈ నెలలో పరీక్షలు ప్రారంభం

18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల 500మందికి పైగా వాలంటీర్లపై ఆక్సఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు  తొలిదశ వ్యాక్సిన్ ట్రయల్ చేశారని , ఈ నెలలో వాటిపై పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు వాలెన్స్ తెలిపారు.

మూడవ దశ ట్రయల్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం

తొలి దశ ట్రయల్ విజయవంతం అయితే వ్యాక్సిన్ ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తారని ప్రశ్నించగా .. 2020 అక్టోబర్, నవంబర్ నాటికి  అందుబాటులోకి తెస్తామని, మూడవ దశ ట్రయల్ విజయవంతం, దాని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశంపై ప్రతిఒక్కరు ఆసక్తిగా ఉన్నట్లు వాలెన్స్  చెప్పారు.

వాలంటీర్లపై ఆరు నెలల పాటు కరోనా వైరస్ వ్యాక్సిన్ పరీక్షలు

తొలిదశలో ప్రారంభమైన వ్యాక్సిన్ టెస్ట్ లను నిర్వహించేందుకు నియమించిన వాలంటీర్లను ఆరునెలలపాటు తమ ఆధీనంలో ఉంచుకుంటామని ఆక్స్  ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు ది సన్ కు తెలిపారు. ఆరు నెలల పాటు కరోనా వైరస్ విరుగుడు కోసం తయారు చేస్తున్న వ్యాక్సిన్ లేదా కంట్రోల్ ఇంజెక్షన్ తో టీకాలు వేయడం, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో వ్యాక్సిన్ పరీక్షలకు సిద్ధంగా ఉండటానికి ముందే వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందడం సవాలుగా మారుతాయని సైంటిస్ట్ బృందం వెల్లడించింది.

కరోనా వైరస్ వస్తే పారాసిటమాల్  వేసుకోవచ్చు

ప్రస్తుతానికి కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ఎటువంటి వ్యాక్సిన్ లేదని, వైరస్ వస్తే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలని సైంటిస్ట్ లు సూచించారు.

నిరాశ పరిచిన ట్రయల్

వాలంటీర్లకు హెచ్ఐవి మెడిసిన్ ను అందించామని, అందులో ఎలాంటి ఫలితాలు రాలేదని తెలిపారు. హెచ్ ఐవీ మెడిసిన్ తో కరోనా వైరస్ తగ్గిపోతుందని భావించినట్లు, వాలంటీర్లపై ప్రయోగించడం వల్ల ఎలా ప్రభావం చూపించలేదని ఆక్స్ పర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ల బృందం ది సన్ కు వెల్లడించింది.