అమెరికాలో తొలి మహిళా సిక్కు జడ్జి

అమెరికాలో తొలి మహిళా సిక్కు జడ్జి

వాషింగ్టన్: అమెరికాలో తొలి మహిళా సిక్కు జడ్జిగా మన్‌‌ప్రీత్ మోనికా సింగ్ నియమితులయ్యారు. టెక్సస్‌‌లోని హారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. మన్‌‌ప్రీత్ తండ్రి ఏజే.. 1970 దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌‌లో పుట్టి, పెరిగిన మన్‌‌ప్రీత్ ప్రస్తుతం బెల్లైర్‌‌‌‌లో భర్త, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు.

సౌత్ టెక్సస్ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టా అందుకున్నారు. 20 ఏండ్ల నుంచి లా ప్రాక్టీస్ చేస్తున్నారు. 100కు పైగా కేసులు వాదించారు. జాతీయ స్థాయిలో పలు సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్లలో పని చేస్తున్నారు.