చెప్పింది చేయడు.. చేసేది చెప్పడు

V6 Velugu Posted on Nov 26, 2021

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు పక్కనబెట్టి, కాన్సెప్ట్ బేస్డ్‌‌ సినిమాలపై ఫోకస్ పెట్టారు రాజశేఖర్. త్వరలో ఆయన నుంచి ‘శేఖర్’ అనే సినిమా వస్తోంది. ఈ చిత్రానికి జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. నిన్న ఈ మూవీ ఫస్ట్​ గ్లింప్స్​ని విడుదల చేశారు. ‘అరకు బోసుగూడెం తోట బంగ్లాలో ముసలి దంపతుల్ని ఎవరో హత్య చేశారంటూ టీవీలో న్యూస్ యాంకర్ చెప్పడంతో ఈ వీడియో మొదలైంది. అక్కడికి వెళ్లిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయకుండా, కొద్ది రోజుల క్రితం పోలీస్ జాబ్‌‌కి రిజైన్​ చేసిన ‘శేఖర్’ కోసం ఎదురు చూస్తున్నారు.

‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా, వాడు చేసేది మనకు చెప్పాడా’ అనే డైలాగ్​తో రాజశేఖర్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌ని రివీల్‌‌ చేశారు. తెల్లని గడ్డం, జుట్టుతో రిటైర్మెంట్‌‌ ఏజ్‌‌ లుక్​లో కనిపిస్తున్నారు రాజశేఖర్. ఆయన ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతోంది అనేది సినిమాలో చూడాలి. మలయాళంలో మెప్పించిన ‘జోసెఫ్‌‌’ సినిమాకి ఇది రీమేక్. ఆత్మీయ రజన్, ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్, భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జనవరి నెలలో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్‌‌ చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.

Tagged jeevitha rajasekhar, Dr Rajasekhar, Sekhar Movie, Sekhar Movie Glimps

Latest Videos

Subscribe Now

More News