గల్ఫ్ దేశాల్లోనే మొదటిసారి అబూదాబిలో నిర్మిస్తున్న హిందూ దేవాలయం నిర్మాణం తాలూకు తుది నమూనా విడుదలైంది. బీఏపీఎస్ హిందూ మందిర్ కమిటీ వీడియో రూపంలో విడుదల చేసిన ఈ నమూనా విశేషంగా ఆకట్టుకుంటోంది. పూర్తిగా శిలలతో నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణానికి అబూ మురీఖా ప్రాంతంలో గతేడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నుంచి నిర్మాణ పనులు కొనసాగనున్నాయి.
