శిశువుల కోసం తొలిసారిగా.. కేర‌ళ‌లో త‌ల్లిపాల బ్యాంకు ఏర్పాటు

శిశువుల కోసం తొలిసారిగా..  కేర‌ళ‌లో త‌ల్లిపాల బ్యాంకు ఏర్పాటు

తొలిసారిగా కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆసుప‌త్రిలో తల్లి పాల బ్యాంకు ఏర్పాటైంది. ‘రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కొచ్చి గ్లోబల్‌’ సహకారంతో నెలకొల్పిన ఈ బ్యాంకును ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రారంభించారు. ఈ ఆసుప‌త్రిలో సేకరించిన పాలను అనారోగ్యంగా ఉన్న తల్లుల చిన్నారులకు, తల్లిని కోల్పోయిన శిశువులకు అందిస్తారు. రూ.35 లక్షల వ్యయంతో నెలకొల్పిన ఈ బ్యాంకులో పాశ్చరైజేషన్‌ యూనిట్, రిఫ్రిజిరేటర్స్, ఆర్‌ఓ ప్లాంట్, కంప్యూటర్లు, ఇతర పరికరాలు ఉన్నాయి. ఇక్కడ ఆరు నెలల పాటు పాలను నిల్వ ఉంచే అవకాశం ఉంది. ఇక్కడి ఆస్పత్రి ఐసీయూలో చేరిన శిశువులకు ఉచితంగానే పాలను అందించనున్నారు. త్వరలో అన్ని ఆస్పత్రులకు ఈ పాలు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు