
డిఫరెంట్ స్టోరీస్‌తో పాటు చాలెంజింగ్ క్యారెక్టర్స్‌తోనూ మెప్పిస్తున్నాడు కార్తి. ప్రస్తుతం సర్దార్, విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, ఖైదీ2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి సందర్భంగా నిన్న ‘విరుమాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మెరూన్ కలర్ షర్ట్, బ్రౌన్ కలర్ లుంగీ, చేతిలో బల్లెంతో సీరియస్ లుక్‌లో ఉన్నాడు కార్తి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మధురై దగ్గర్లోని ఓ విలేజ్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ముత్తయ్య డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కార్తి అన్నయ్య సూర్య నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌లో మూవీ రిలీజ్ కానుంది.