యాక్షన్​ టర్బో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

యాక్షన్​ టర్బో..  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

డెబ్బై రెండేళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మలయాళ స్టార్ మమ్ముట్టి. ఇప్పటికే చేతినిండా  ప్రాజెక్టులతో..  డిఫరెంట్ పాత్రలతో మెప్పిస్తున్నారు. ఆయన లీడ్‌‌గా నటిస్తున్న చిత్రాల్లో ‘టర్బో’ ఒకటి. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను ఆదివారం రిలీజ్ చేశారు. తెల్ల పంచె, నల్ల షర్ట్‌‌తో జీపులో నుంచి దిగుతూ ఇంటెన్స్ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నారు మమ్ముట్టి. ఈ పోస్టర్‌‌‌‌ను బట్టి ఇదొక యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌గా కనిపిస్తోంది. 

వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిధున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. మమ్ముట్టి తన బ్యానర్‌‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ‘భమ్రయుగం’ షూటింగ్‌‌ను కూడా పూర్తి చేశారు మమ్ముట్టి. రాహుల్ సదాశివన్  రూపొందించిన ఈ చిత్రం కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ . 

అలాగే ఆయన తెలుగులో ‘యాత్ర2’  చిత్రంలో నటిస్తున్నారు. వై.ఎస్‌‌.రాజ‌‌శేఖ‌‌ర్ రెడ్డి పాత్రలో  మ‌‌మ్ముట్టి,  జ‌‌గ‌‌న్‌‌ పాత్రలో జీవా న‌‌టిస్తున్న ఈ చిత్రాన్ని మహి.వి.రాఘవ రూపొందిస్తున్నాడు. ఫిబ్రవరి 8న సినిమా విడుదల కానుంది.