తొలి ప్రధాని నెహ్రూ ఢిల్లీ బంగ్లా అమ్మకం : ఎన్ని వేల కోట్లకు అమ్ముడుపోయిందో తెలుసా..!

తొలి ప్రధాని నెహ్రూ ఢిల్లీ బంగ్లా అమ్మకం : ఎన్ని వేల కోట్లకు అమ్ముడుపోయిందో తెలుసా..!

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా పనిచేశారు జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన ఢిల్లీ నడిబొడ్డున నివసించిన లుటియెన్స్ బంగ్లా జోన్ అధికారిక నివాసం ప్రస్తుతం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. నెహ్రూ మొదటి అధికారిక నివాసంగా పనిచేసిన మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని విశాలమైన బంగ్లా సుమారు రూ.11 వందల కోట్లకు అమ్ముడవుతోంది. 

దాదాపు 3.7 ఎకరాల్లో 24వేల చదరపు అడుగున నిర్మాణాలు కలిగిన ఈ బంగ్లా దేశంలో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లలో ఒకటిగా నిలిచింది. దీనిని దేశంలోని బెవరేజెస్ వ్యాపారంలో ఉన్న ఒక వ్యాపారవేత్త కొంటున్నట్లు వెల్లడైంది. ఈ ఆస్తి ప్రస్తుతం రాజస్థాన్‌కు చెందిన మాజీ రాజకుటుంబ సభ్యులు రాజ్ కుమారి కాకర్, బినా రాణిల యాజమాన్యంలో ఉంది. అయితే వారు ఈ ఆస్తిని రూ.వెయ్యి 400 కోట్లకు అమ్మాలని ప్రాపర్టీని లిస్ట్ చేశారు. 

ఢిల్లీలోని లుటియెన్స్ బంగ్లా జోన్ దాదాపు 3వేల బంగ్లాలకు నిలయంగా ఉంది. దీనిని 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియెన్స్ రూపొందించారు. ఈ బంగ్లాల్లో ఎక్కువ శాతం మంత్రులు, న్యాయవాదులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 600 ప్రాపర్టీలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నాయి. ఒకవేళ ఈ బంగ్లాను రూ.11 వందల కోట్లకు అమ్మితే భారతదేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో మునుపటి రికార్డులను అధిగమిస్తుందని రియల్టర్లు అంటున్నారు. అలాగే ఈ డీల్ లుటియెన్స్ బంగ్లా జోన్  ప్రతిష్టను కూడా హైలైట్ చేస్తోందని వారు అంటున్నారు.