సెప్టెంబ‌‌‌‌ర్ 19న డెవిల్‌‌‌‌ నుంచి ఫస్ట్ సాంగ్

 సెప్టెంబ‌‌‌‌ర్ 19న  డెవిల్‌‌‌‌ నుంచి ఫస్ట్ సాంగ్

బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌‌‌గా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘డెవిల్‌‌‌‌’. సంయుక్త హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌‌‌‌ డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మాయే చేసే..’ అనే పాట‌‌‌‌ను సెప్టెంబ‌‌‌‌ర్ 19న విడుద‌‌‌‌ల చేయ‌‌‌‌బోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కళ్యాణ్ రామ్, సంయుక్త ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఇక సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు సత్య ఆర్.వి లిరిక్స్ రాశాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చాడు. న‌‌‌‌వంబ‌‌‌‌ర్ 24న ఈ స్పై థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీకాంత్ విస్సా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. సౌంద‌‌‌‌ర్ రాజ‌‌‌‌న్ సినిమాటోగ్రాఫ‌‌‌‌ర్‌‌‌‌గా వ‌‌‌‌ర్క్ చేశారు.