‘కామాఖ్య’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

‘కామాఖ్య’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటుడు అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కామాఖ్య’. వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసిన మేకర్స్‌‌‌‌..  మ్యూజికల్ ప్రమోషన్స్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశారు. ఫస్ట్ సింగిల్‌‌‌‌గా ‘సఖీ’ అనే పాటను విడుదల చేశారు. ‘‘సఖీ గులాబి మన స్నేహమే.. సరదాల దీవి మన స్నేహమే.. సఖీ ఇలాంటి మన స్నేహమే.. నిలవాలి ఇంక కల​కాలమే..” అంటూ సాగిన ఈ ఈ ఫ్రెండ్​షిప్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను జ్ఞానీ కంపోజ్ చేయగా లక్ష్మీ మేఘన పాడారు. 

‘రా నాతో ఆ ఆకాశంలో మేఘాలవుదాం.. ఓ వర్షం కురిపించేద్దాం.. రా నాతో ఆ సంగీతంలో రాగాలవుదాం.. ఈ గీతం వినిపించేద్దాం.. ‘‘రూపములు రెండే మాలో శ్వాసొకటే.. చాటి చెబుదాం భూమికి ఈ మాటే.. పేరులివి వేరే కానీ తీరు ఒకటే.. రాసి పెడదామే ఇపుడే ఈ చోటే..” అంటూ స్నేహ మాధుర్యాన్ని చాటుతూ అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. సమైరా,  శరణ్య ప్రదీప్ కాంబినేషన్‌‌‌‌లో చిత్రీకరించారు.