డ్యూడ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

డ్యూడ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

ప్రదీప్ రంగనాథన్ హీరోగా  కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూడ్’. యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా, తాజాగా రెండో పాటను విడుదల చేశారు.  రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించగా,  సాయి అభ్యాంకర్ హార్ట్ టచ్చింగ్ మెలోడీగా కంపోజ్ చేస్తూ, సంజిత్‌‌‌‌తో కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. 

‘నీ ఇష్టం సర్లేకానీ.. ఆనందంగా బతకవే పో.. తీరేదే కాదే నా ప్రేమ.. ఆగిపోనే వెన్నెలే, మారిపోనే పోదులే..’ అంటూ  తను ప్రేమించిన అమ్మాయి ఛాయిస్‌‌‌‌ని రెస్పెక్ట్  చేస్తూ  ప్రదీప్ లవ్ ఫీలింగ్స్‌‌‌‌ని  ప్రజెంట్ చేసేలా  సాగిన పాట సినిమాపై ఆసక్తిని పెంచింది.  ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజూ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న  ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానుంది.