మిరాయ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

మిరాయ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాయ్’.  ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, శనివారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌‌‌ను  రిలీజ్ చేశారు.  గౌర హరి కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ పాడిన తీరు ఆకట్టుకుంది. ‘ఓ పోరి దిల్దారు వయ్యారివే.. నీ సూపు తల్వారుతో కొయ్యకే.. గాడ్ ఏమో నీకు నాకు రాసుంటాడే.. మన జోడీ ఒకటయితే మ్యాడ్ ఉంటాదే.. వైబ్ ఉంది బేబీ.. వైబ్ ఉందిలే.. ఈ గ్లోబ్‌‌‌‌ను ఆపే  వైబ్ ఉందిలే. 

స్టెప్పులు వేసిందే దినక్‌‌‌‌దినా కొత్తగా  నా గుండె.. డప్పులు కొట్టిందే దినక్‌‌‌‌దినా.. పక్కన నువ్వుంటే.. నీ పేరు టాటూలా రాయించనా.. మన పెయిరే హిట్ పెయిరు చేసేయనా..’ అంటూ సాగిన పాటలో తేజ సజ్జా స్టైలిష్ మూమెంట్స్‌‌‌‌తో ఇంప్రెస్ చేశాడు.  హీరోయిన్  రితికా నాయక్‌‌‌‌తో కలిసి ఎనర్జిటిక్‌‌‌‌గా కనిపించాడు. మనోజ్ మంచు విలన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  సెప్టెంబర్ 5న 2డి, 3డి ఫార్మాట్స్‌‌‌‌లో ఎనిమిది భాషల్లో సినిమా విడుదల కానుంది.