జిగ్రీస్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

జిగ్రీస్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో హరిష్ రెడ్డి ఉప్పుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిగ్రీస్‌‌‌‌‌‌‌‌’.  కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ రాగా, తాజాగా ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘మీరేలే’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు తరుణ్ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేసి బెస్ట్ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 

సయ్యద్ కమ్రాన్ ఈ మెలోడీ సాంగ్‌‌‌‌‌‌‌‌ను కంపోజ్ చేయగా, ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్ పాడాడు. ‘‘మీరని నేనని వేరైతే  వెలివేస్తా నను నేనే..” అంటూ స్నేహితుల మధ్య ఉండే బాండింగ్‌‌‌‌‌‌‌‌ను, ఎమోషన్‌‌‌‌‌‌‌‌ను తెలియజేసేలా హరీష్ రెడ్డి ఉప్పుల రాసిన లిరిక్స్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకున్నాయి. జిగ్రీస్ ఫ్రెండ్షిప్, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 14న  సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.