కేంద్ర కమిటీ మీటింగ్ కు నో ఎజెండా.. కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా!

కేంద్ర కమిటీ మీటింగ్ కు నో ఎజెండా..  కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా!
  •     ఆ సమావేశంలోనే జలవివాదాలపై ఎజెండా ఖరారు చేసే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న జలవివాదాలపై ఎజెండా లేకుండానే తొలి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే ఏయే అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య చర్చలుండాలనే విషయాన్ని తేల్చనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలవివాదాల పరిష్కారానికి కేంద్రం రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ తొలిసమావేశాన్ని ఈ నెల 30న నిర్వహించనున్నారు. 

కాగా, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించాలన్న దానిపై అధికారులు ఇప్పటికే ఓ ఎజెండాను తయారు చేయగా.. ఇప్పుడే ఎజెండా వద్దని ప్రభుత్వం చెప్పినట్టు తెలిసింది. ముందుగా ఆ సమావేశానికి హాజరైతే.. ఏయే అంశాలపై చర్చించాలన్న దానిమీద క్లారిటీ వస్తుందని, ఆ తర్వాతే పూర్తి ఎజెండాను సిద్ధం చేద్దామని చెప్పినట్టు సమాచారం. కాగా, కేంద్ర కమిటీ మీటింగ్​ నేపథ్యంలో కృష్ణా బోర్డు మీటింగ్​ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.