వరల్డ్‌ ఓపెన్‌ చెస్‌ టైటిల్‌ సాధించిన తొలి ఇండియన్

వరల్డ్‌ ఓపెన్‌ చెస్‌ టైటిల్‌ సాధించిన తొలి ఇండియన్

ఇనియన్‌కు వరల్డ్‌ ఓపెన్‌ చెస్‌ టైటిల్‌

ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌

చెన్నై: ఇండియన్‌‌  గ్రాండ్‌‌మాస్టర్‌‌(జీఎం) ఇనియన్‌‌.. వరల్డ్‌‌ ఓపెన్‌‌ చెస్‌‌ టైటిల్‌‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌గా చరిత్ర సృష్టించాడు. కరోనా ముప్పు వల్ల ఆన్‌‌లైన్‌‌లో జరిగిన ఈ టోర్నీ గత నెలలోనే ముగిసింది. కానీ ఫెయిర్‌‌ ప్లే ఎనాలిసిస్‌‌ చేసిన టోర్నీ నిర్వాహకులు గురువారం విజేతను ప్రకటించారు. తొమ్మిది రౌండ్లు జరిగినఈ ఈవెంట్‌‌లో ఇనియన్‌‌తోపాటు రష్యన్‌‌ జీఎం సుగిరో సనన్‌‌ చెరో 7.5 పాయింట్లు సాధించి టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచారు. కానీ బ్రేక్‌‌ స్కోర్లలో ఇనియన్‌‌ ముందుండడంతో నిర్వాహకులు అతనికే ఓటు వేశారు. టోర్నీని డ్రాతో మొదలుపెట్టిన ఇనియన్‌‌.. ఆ తర్వాత వరుసగా ఆరు బోర్డుల్లో విజయం సాధించాడు. చివరి రెండు బోర్డులను డ్రాగా ముగించాడు.  ఇదే అతనికి కలిసొచ్చింది.

For More News..

మారటోరియం వడ్డీ కట్టాల్సిందే!

పాత బండ్లు తెగకొంటున్రు

మానసిక సమస్యలు తగ్గుతలేవని సుశాంత్.