నిరుద్యోగుల కుటుంబాల కన్నీళ్లలో ఎమ్మెల్యే కేటీఆర్ కొట్టుకుపోవడం పక్కా : మెట్టు సాయి కుమార్

నిరుద్యోగుల కుటుంబాల కన్నీళ్లలో ఎమ్మెల్యే కేటీఆర్ కొట్టుకుపోవడం పక్కా : మెట్టు సాయి కుమార్
  •    ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రం అడుగడుగునా అడ్డుపడ్డి వచ్చిన ఉద్యోగాలను ఏదో రకంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా నిరుద్యోగుల కుటుంబాల కన్నీళ్లలో కొట్టుకుపోవడం పక్కా అని స్పష్టం చేశారు.

 పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు కష్టపడి చదివి గ్రూప్–1కు ఎంపికైతే కోట్ల రూపాయలతో ఉద్యోగాలు కొనుక్కున్నారని కేటీఆర్ ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ విధంగా మాట్లాడడం ఏమిటని, మరి ఆయన కూడా ఐపీఎస్ ను అలానే సంపాదించారా అని ఫైర్ అయ్యారు. 

పదేండ్లలో బీఆర్ఎస్ ఇవ్వలేని ఉద్యోగాలను 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే  ఓర్వలేకుండా తప్పుడు ఆరోపణలు చేయడమే కేటీఆర్, హరీశ్, ప్రవీణ్ కుమార్ లు పనిగా  పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఏడవడం తప్ప ప్రతిపక్ష నేతలుగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం కృషి చేయడం లేదని 
విమర్శించారు.