బేగంబజార్​లో రోడ్డును విస్తరించాలి .. మంత్రి పొన్నం ప్రభాకర్ కు మెట్టు సాయికుమార్ విజ్ఞప్తి

బేగంబజార్​లో రోడ్డును విస్తరించాలి .. మంత్రి పొన్నం ప్రభాకర్ కు మెట్టు సాయికుమార్ విజ్ఞప్తి

ట్యాంక్ బండ్, వెలుగు: బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఛత్రి ప్రాంతాల్లో రోడ్డును విస్తరించాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సాయికుమార్​మాట్లాడుతూ.. గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్, సిద్ధిఅంబర్ బజార్, ఛత్రి ప్రాంతాలు వ్యాపార కేంద్రాలుగా మారడంతో రోజూ ట్రాఫిక్​సమస్యలు తలెత్తుతున్నాయని, తెలిపారు. 

ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్​పూర్తయితే భవిష్యత్తులో ఈ రోడ్డు మరింత రద్దీగా మారే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రోడ్డును వెడల్పు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు.