మల్యాల, వెలుగు : చేపల వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఎస్ఐ నరేశ్‌కుమార్ కథనం మేరకు.. మల్యాల మండలం నూకపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు దువ్వాక నర్సయ్య(55), గురువారం సాయంత్రం చేపలు పట్టేందుకు రామన్నపేట శివారులోని వరద కాల్వకు వెళ్లాడు. రాత్రి అయినా నర్సయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ దొరకలేదు.
శుక్రవారం ఉదయం వరద క్వాల వద్ద నర్సయ్య చెప్పులు చూసిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి వరద కాల్వలో గాలింపు చేసి డెడ్ బాడీని బయటకు తీశారు. ప్రమాదవశాత్తు చేపల వలలో చిక్కుకొని నీట మునిగి నరసయ్య చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. మృతుడి కొడుకు నరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ తెలిపారు.
