రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై సస్పెన్స్!

రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై సస్పెన్స్!

ముల్లాన్‌‌పూర్: అఫ్గానిస్థాన్‌‌తో జరిగే మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌కు ముందు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తమ ఫిట్‌‌నెస్ పరీక్షలను పూర్తి చేశారో లేదో తనకు తెలియదని భారత సహాయ కోచ్ సితాంశు కోటక్ తెలిపారు. కానీ వీరిద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు తాను విన్నానని పేర్కొన్నారు. ఐపీఎల్ సమయంలో హార్దిక్ పాండ్య వెన్నునొప్పితో బాధపడగా.. రోహిత్ శర్మ హ్యామ్‌‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఐపీఎల్ టోర్నీలో వీరిద్దరూ పలు మ్యాచ్‌‌లకు దూరమయ్యారు.

బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) లో జరిగే ఫిట్‌‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనతోనే వీరిని వన్డే జట్టుకు ఎంపిక చేశారు. రోహిత్ శర్మ ఇప్పటికే ఫిట్‌‌నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సీఓఈకి చేరుకున్నట్లు సమాచారం. వన్డే జట్టులోని ఆటగాళ్లు సోమ, మంగళవారాల్లో ఇక్కడికి చేరుకుంటారని కోటక్ సమాచారం ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఫ్లడ్‌‌లైట్ల వెలుతురులో జట్టు ప్రాక్టీస్ చేస్తుందని, ఆ తర్వాత గురువారం ధర్మశాలకు బయలుదేరుతుందని చెప్పారు.