చాలా తక్కువ బడ్జెట్​లో.. వీడియో మేకింగ్​ కిట్​

చాలా తక్కువ బడ్జెట్​లో.. వీడియో మేకింగ్​ కిట్​

కొత్తగా వీడియోలు తీసే కంటెంట్​ క్రియేటర్లు, వ్లాగర్లకు ట్రైపాడ్​, మైక్​, ఎల్​ఈడీ లైట్లు కొనుక్కోవడం కాస్త భారమే. అందుకే అలాంటివాళ్లకోసం ఫిట్రిక్​ అనే కంపెనీ బేసిక్​ వీడియో మేకింగ్​ కిట్​ని మార్కెట్​లోకి తెచ్చింది. ఇది చాలా తక్కువ బడ్జెట్​లో దొరుకుతుంది. ఈ కిట్​లో ఒక ట్రైపాడ్​ ఉంటుంది. దీన్ని హ్యాండిల్​లా కూడా వాడుకోవచ్చు. దాంతోపాటే కిట్ 3.5mm ప్లగ్​తో  మైక్రోఫోన్ ‌ వస్తుంది. దీన్ని వీడియో రికార్డ్​ చేసేటప్పుడు స్మార్ట్​ఫోన్​కి కనెక్ట్​ చేసుకోవచ్చు. చీకట్లో వ్లాగ్స్​ తీసేవాళ్లకు వీలుగా ఉండేందుకు ఈ కిట్​లో ఒక ఎల్​ఈడీ లైట్​ని కూడా ఇచ్చారు. ఇందులో మూడు AAA బ్యాటరీలు వేసుకుని వాడుకోవచ్చు. 

ధర: 759 రూపాయలు