భార‌త్‌కు ఐదు కోట్ల డోసుల ఫైజర్ వ్యాక్సిన్

భార‌త్‌కు ఐదు కోట్ల డోసుల ఫైజర్ వ్యాక్సిన్

భార‌త్‌లో చేసిన వ్యాక్సినేషన్ లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు దేశంలోనే ఉత్ప‌త్తి అయ్యాయి. ర‌ష్యాలో ఉత్ప‌త్తి అయిన స్పుత్నిక్‌-వీను తొలిసారి భార‌త్ దిగుమ‌తి చేసుకుంది. విదేశాల్లో ఉత్ప‌త్తి అయి భార‌త్‌ దిగుమ‌తి చేసుకున్న మొదటి తొలి టీకాగా స్పుత్నిక్-V. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం వరకు ఫైజ‌ర్ కూడా భార‌త్‌లో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అమెరికాలోని ఫైజ‌ర్ సంస్థ నుంచి ఐదు కోట్ల క‌రోనా వ్యాక్సిన్లు భారత్ కు రానున్నాయి. ఇందుకోసం భార‌త ప్రభుత్వం-ఫైజ‌ర్ ప్ర‌తినిధుల మ‌ధ్య‌ చర్చలు జరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. భార‌త్‌లో స్పుత్నిక్‌-Vతో క‌లిపి ఇప్ప‌టికే మూడు క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  

భార‌త్‌కు ఫైజ‌ర్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తికి  అగ్రిమెంట్ కుదిరితే ఐరోపా దేశాల్లో ఫైజర్ టీకాను ఉత్పత్తి చేస్తున్న సంస్థ‌ల‌ నుంచే భారత్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది. భార‌త్‌లోని జ‌నాభా మొత్తానికీ వ్యాక్సిన్లు అందించ‌డానికి పెద్ద ఎత్తున విదేశాల నుంచి వ్యాక్సిన్ల‌ను దిగుమ‌తి చేసుకునే అవ‌కాశం ఉంది.