నాంపల్లి అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

నాంపల్లి అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

హైదరాబాద్: నాంపల్లి బచన్  ఫర్నీచర్స్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత రెండోరోజు సహాయక చర్యలు కొనసాగుతన్నాయి. భవనంలో చిక్కుకున్న ఐదుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాదం జరిగి 20 గంటలు గడిచినా సెల్యూలార్ లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.  పక్క భవనం గోడలు పగలగొట్టి లోపలి వెళ్లేందుకు రెస్క్యూటీం ప్రయత్నించింది. భవనం మొత్తం దట్టమయిన పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలు అడ్డంకిగా మారాయి.  తమ వారిఆచూకి ఇప్పటివరకు తెలియకపోవడంతో బాధితుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. 

దాదాపు 200 మంది  సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు సెల్లార్లలోనూ  భారీగా ఫర్నీచర్ ఉండటంతో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దట్టమయి పొగలు కమ్ముకోవడంతో లోపలికి వెళ్లేందుకు కష్టంగా మారింది. భవనం భద్రతను పరిశీలించేందుకు జేఎన్ టీయూ ఇంజనీరింగ్ టీంను  ఘటనాస్థలానికి రప్పించారు. 

శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. అబిడ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌ వెళ్లే రోడ్డులోని బచస్‌‌‌‌‌‌‌‌ ఫర్నిచర్ క్యాస్టిల్‌‌‌‌‌‌‌‌ షాపులో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు మృతి చెందారు. 

ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌తో నిండిన పొగతో ఊపిరి ఆడక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలు గుర్తించలేనంతగా కాలిబూడిదయ్యాయి. ఘటనా స్థలంలో ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేపట్టి  శ్రమించారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడలేక పోయారు. డెడ్‌‌‌‌బాడీలను బయటకు ఆదివారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

మరోవైపు 20గంటలుగా  భవనం సెల్లార్లలో మంటలు అదుపులోకి రాకపోవడంతో భవనం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. భవనం పరిస్థితని  పరిశీలించేందుకు  జెఎన్ టీయూ ఇంజినీరింగ్ టీం ను రప్పించారు.  భవనాన్ని పరిశీలించి భద్రతపై రిపోర్టు ఇవ్వనున్నారు.