
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తాజాగా మృతుల సంఖ్య ఆరకు చేరింది. గాయపడ్డ ముగ్గురిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. డివైడర్ ను కారు ఢీకొనడంతో కారులో మంటలు కూడా చెలరేగాయి. కారులో పొగలు చెలరేగడంతో ఊపిరాడక చనిపోయారు. మరోవైపు గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? అనే దానిపై విచారణ చేపట్టారు. అత్యంత వేగంతో డివైడర్ ను ఢీకొట్టడం వల్లే... ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. చిన్న కారులో ఎక్కువమంది ప్రయాణించడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులంతా విజయనగరం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.