అల్లాదుర్గం, వెలుగు: ఐదు నెలల గర్భిణీ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ జిల్లా కోటపల్లి గ్రామానికి చెందిన సుస్మిత (23)కు మండలంలోని గడిపెద్దాపురం గ్రామానికి చెందిన అభిలాష్తో 18 నెలల కింద వివాహం జరిగింది. కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
భార్యను అనుమానంతో తరచూ హింసించేవాడనీ, భార్య ఐదు నెలల గర్భిణీ అయినా ఆమెను అనుమానిస్తూ తరచుగా డీఎన్ఏ పరీక్షలు చేయించాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో సుస్మిత గురువారం రాత్రి ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.తన కూతురు సుస్మిత మృతికి భర్త అభిలాష్, అత్త శశిరేఖ కారణమంటూ మృతురాలి తల్లి జానాభాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.
