
- మరో ముగ్గురితో పోలీసులకు చిక్కిన యువకుడు
- నలుగురిని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు
- 1.5 కేజీల గంజాయి స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: ఇంటర్‌వరకు చదువులో రాణించిన ఓ యువకుడు గంజాయికి బానిసై ఏడేండ్లుగా కుటుంబానికి దూరమ్యాడు. మరో ముగ్గురితో కలిసి గంజాయి తాగుతూ తాజాగా పోలీసులకు చిక్కాడు. మాదాపూర్ జోన్ డీసీపీ డా.జి.వినీత్, టీజీ న్యాబ్ఎస్పీ సాయి చైతన్య శనివారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన ఎం.సచితానంద్(28) గంజాయి పెడ్లర్.
బోయిన్‌పల్లికి చెందిన కురుంతోత్రాథోడ్నవీన్ నాయక్(27), కూకట్‌పల్లికి చెందిన ఇంటీరియర్డిజైనర్ ప్రణీత్‌రెడ్డి(25), న్యూ బోయిన్‌పల్లికి చెందిన రాహుల్ రాజ్(27) స్నేహితులు. వీరంతా కలిసి ఈ నెల 28న మాదాపూర్‌లోని హైటెక్స్బిల్డింగ్సమీపంలో గంజాయి తాగుస్తున్నారు. సమాచారం అందుకున్న టీజీ న్యాబ్, మాదాపూర్పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి మత్తుతో జీవితం చిత్తు
నిందితుల్లో ఒకరైన నవీన్ నాయక్ బ్రిలియంట్స్టూడెంట్. ఇతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నవీన్‌ను పెంచారు. ఇంటర్‌వరకు మంచిగా చదివిన నవీన్, 2015లో తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎన్ఐటీలో సీటు సంపాదించాడు. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చదువును పక్కన పెట్టి, తరచూ గంజాయి తీసుకోవడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న నవీన్‌తల్లి నెల రోజులపాటు తిరుచిరాపల్లిలో ఉండి కొడుకును చూసుకుంది. అయినప్పటికీ అతనిలో మార్పురాలేదు. ఇంజనీరింగ్‌ను మూడో సంవత్సరంలో బంద్‌చేసి బెంగుళూరుకు వెళ్లాడు. అక్కడి ప్రైవేట్కంపెనీలో కొన్నాళ్లు మార్కెటింగ్ఆఫీసర్పనిచేశాడు.
వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ గంజాయి సప్లయర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. డబ్బుల కోసం తోటి ఉద్యోగులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గంజాయి, ఎండీఎంఏ అమ్మడం మొదలుపెట్టాడు. 2022లో సిటీలోని దుండిగల్ లో ఎండీఎంఏ అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. 2023లో కేరళలోని పాలక్కడ్పోలీసులకు దొరికాడు. నవీన్పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. తాను గంజాయికి బానిసై ఏడేండ్లుగా ఇంటికి పోలేదని, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నానని పోలీసుల విచారణలో నవీన్ చెప్పాడు.