ఐదు ఆప్షన్స్​, నాలుగు బబుల్స్​..NMMS ఎగ్జామ్‌లో బ్లండర్

ఐదు ఆప్షన్స్​, నాలుగు బబుల్స్​..NMMS ఎగ్జామ్‌లో బ్లండర్
  • పార్ట్ –ఏ లో 90 ప్రశ్నల కింద 5 ఆప్షన్లు
  • ఓఎంఆర్ షీట్ లో కేవలం నాలుగు బబుల్స్​మాత్రమే!
  • కన్ఫ్యూస్​ అయిన స్టూడెంట్స్​
  • రాష్ట్ర విద్యాశాఖ తీరుపై విమర్శలు
  • పరీక్ష రద్దు చేసే చాన్స్

మహబూబాబాద్, వెలుగు:  ప్రభుత్వ స్కూళ్లలో తొమ్మిది నుంచి 12 వరకు చదివే పేద స్టూడెంట్లకు కేంద్రం ఇచ్చే స్కాలర్ షిప్​ కోసం ఆదివారం స్టేట్​వైడ్​నిర్వహించిన ఎన్ఎంఎంఎస్​(నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ ) పరీక్షలో బ్లండర్​ జరిగింది. ఇందుకోసం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తయారుచేసిన పార్ట్ –ఏ పేపర్​లో 90 ప్రశ్నలకుగాను ఒక్కో ప్రశ్నకు 5 ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఓఎంఆర్​షీట్​లో నాలుగు బబుల్స్​ మాత్రమే ఉండడంతో స్టూడెంట్లు, టీచర్లు పరేషాన్​ అయ్యారు. ముఖ్యంగా కరోనా టైంలో భయంభయంగా వచ్చి ఎగ్జామ్​ రాసిన వేలాది మంది స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంగా మారింది.

110 సెంటర్లలో ఎగ్జామ్స్​

కేంద్ర ప్రభుత్వం.. గవర్నమెంట్​ స్కూళ్లలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతిభగల పేద స్టూడెంట్లకు నాలుగేళ్లపాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున స్కాలర్ షిప్ అందజేస్తోంది. ఇందుకోసం ఏటా టెన్త్​స్టూడెంట్స్​కు స్టేట్ లెవెల్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ), ఎనిమిదో తరగతి స్టూడెంట్స్ కు నేషనల్ మీన్స్​ కమ్ మెరిట్ స్కాలర్​షిప్​ఎగ్జామినేషన్(ఎన్​ఎంఎంఎస్​ఈ)  నిర్వహిస్తోంది. ఆయా స్టేట్​సిలబస్​కు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎగ్జామ్​పేపర్లను తయారుచేసి నిర్వహించాలి. ఈ క్రమంలోనే  ఆదివారం ఎన్ టీఎస్​ఎగ్జామ్​ను స్టేట్​వైడ్​ 141 సెంటర్లలో నిర్వహించగా, 20,978 మంది స్టూడెంట్స్​కు గాను  ఫస్ట్​ ఎగ్జామ్​మ్యాట్​కు17,683 స్టూడెంట్లు, రెండో ఎగ్జామ్​ సాట్ కు 17,653 మంది  హాజరయ్యారు. ఇక ఎన్​ఎంఎంఎస్ఈని 110 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా, 15,321 మంది స్టూడెంట్స్​కుగాను 13,957 (91.10శాతం)  మంది అటెండ్ అయ్యారు.

ఆఫీసర్ల నిర్లక్ష్యంతో స్టూడెంట్లు పరేషాన్​

ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ఈ క్వశన్​పేపర్​కు సంబంధించి​ పార్ట్– ఏలో  90 ప్రశ్నలు, పార్ట్ –బీలో 90 ప్రశ్నలు ఉన్నాయి. ఈ180 ప్రశ్నలకు కింద ఉన్న ఆప్షన్స్​లో సరైన ఆన్సర్​ ఎంచుకొని ఓఎంఆర్ షీట్ లోని బబుల్స్​ఫిల్​చేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో  ప్రతి క్వశ్చన్​కింద 5 ఆప్షన్లు ఇచ్చారు. కానీ  ఓఎంఆర్ షీట్ లో నాలుగు బబుల్స్​ మాత్రమే ఉన్నాయి.  దీంతో ఐదో  ఆప్షన్ సరైన ఆన్సర్ అయినప్పుడు స్టూడెంట్స్​ఆన్సర్​ చేయలేకపోయారు. కొంతమంది ఓఎంఆర్​షీట్​లో ఐదో బబుల్​గీసి, ఫిల్​ చేస్తే ఇంకొందరు నాలుగో నంబర్​లో ఆన్సర్​ వేశారు. క్వశ్చన్​పేపర్​ చూసిన టీచర్లు కూడా ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు. కరోనా టైంలో భయంభయంగా వచ్చి పరీక్ష రాస్తే ఇలాంటి క్వశ్చన్​పేపర్​ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చివరి నిమిషంలో పొరపాటును గుర్తించిన ఎడ్యుకేషన్​ఆఫీసర్లు ఇప్పుడు ఓఎంఆర్​షీట్​ను మ్యాన్​వల్​గా దిద్దిస్తామని చెబుతున్నారు. అసలు ఐదో బబుల్​అనేదే​లేనప్పుడు మ్యాన్​వల్​గా దిద్దినా ఎలాంటి ప్రయోజనం ఉండదని, మరోసారి ఎగ్జామ్​ నిర్వహించాల్సి వస్తుందని టీచర్లు స్పష్టం చేస్తున్నారు.

 

స్టూడెంట్స్​ కన్ఫ్యూజ్​ అయ్యారు

ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్​ పార్ట్​ఏలో ప్రతి క్వశ్చన్​ కింద ఐదు ఆప్షన్లు ఇచ్చి, ఓఎంఆర్​షీట్​లో నాలుగు బబుల్స్​ఇవ్వడంతో స్టూడెంట్స్​ కన్ఫ్యూజ్​ అయ్యారు.  ఇలాంటి పరిస్థితుల్లో ఓఎంఆర్​ షీట్ ను సరిగ్గా అనాలసిస్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు.  మళ్లీ పరీక్షలు నిర్వహించక తప్పదు. లేదంటే 90 మార్కుల పార్ట్​బీ ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొని స్టూడెంట్స్​కు నష్టం జరగకుండా చూడాలి.– సీహెచ్. స్వామి, గవర్నమెంట్​ టీచర్, తొర్రూరు

ఆన్సర్ ఎంపిక చేయలేక ఇబ్బంది పడ్డా

ఎన్ఎంఎంఎస్  మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపిక కావాలని బాగా చదువుకొని వచ్చా. కానీ పార్ట్​ఏ అంతా కన్ఫ్యూస్​గా ఉంది. క్వశ్చన్​ కింద ఐదు ఆప్షన్లు ఉన్నా  ఓఎంఆర్ షీట్ లో నాలుగు బబుల్స్​ మాత్రమే ఇచ్చారు. ఐదో ఆప్షన్​ కరెక్ట్ ఆన్సర్​ అయినప్పుడు బబుల్​ ఫిల్​ చేయలేకపోయా. కరోనా టైంలో భయంభయంగా వచ్చి పరీక్ష రాశా. ఇప్పుడు రద్దు చేస్తే మళ్లీ రావాలంటే మా పేరెంట్స్​ పంపిస్తారో లేదో!   – సాయి అలేఖ్య, 8వతరగతి, కంబాలపల్లి​, మహబూబాబాద్​

మ్యానువల్ వాల్యువేషన్​ చేస్తం

ఆదివారం జరిగిన స్టేట్ లెవెల్ ఎన్టీఎస్ఈ, ఎన్​ఎంఎంఎస్ఈ   ప్రశాంతంగా ముగిశాయి. కానీ ఎన్​ఎంఎంఎస్ ఎగ్జామ్​ ఓఎంఆర్​ షీట్​లో ఐదు ఆప్షన్లకు గాను నాలుగు వచ్చినట్టు గుర్తించాం. దీంతో ఈసారి ఆన్​లైన్ వాల్యువేషన్​ కాకుండా, మ్యానువల్​గా వాల్యువేషన్​ చేయాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని జిల్లాలకు తెలియజేశాం. స్టూడెంట్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సత్యనారాయణరెడ్డి, పరీక్షల విభాగం డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

రేషన్ ​కార్డులు లేవని లోన్లు ఇస్తలేరు

ఆర్టీఏ సేవలకు ఆధార్ తప్పనిసరి

వరి సాగులో ఆల్‌‌టైమ్‌‌ రికార్డ్‌‌

పర్మినెంట్ చేయరు.. జీతాలు పెంచరు