
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో బ్యాంకుకు సంబంధించిన అన్ని పనులను ప్రొబేషనరీ ఆఫీసర్లే చేసేవారు. లోన్లు, అకౌంట్స్, క్యాష్, అడ్మినిస్ట్రేషన్ విధులను నిర్వర్తించేవారు. ప్రస్తుతం ప్రతి విభాగంలోనూ స్పెషలైజ్డ్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం.
పోస్టులు: మొత్తం 1,007 పోస్టుల్లో ఐటీ ఆఫీసర్
(స్కేల్–I) 203, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్
(స్కేల్-–I) 310, రాజ్యభాషా అధికారి (స్కేల్–-I) 78, లా ఆఫీసర్ (స్కేల్-–I) 56, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-–I) 10, మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్----------–I) 350.
ఎలిజిబిలిటీ
ఐటీ ఆఫీసర్ (స్కేల్-I)
పోస్టును అనుసరించి కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ ఇనుస్ట్రుమెంటేషన్‌లో నాలుగేండ్ల ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ ఇనుస్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-I)
అగ్రికల్చర్/ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసి కల్చర్/ అగ్రి మార్కెటింగ్ అండ్ కో–ఆపరేషన్, కో–ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్/ అగ్రో ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్బయోటెక్నాలజీ/ బి.టెక్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్/ ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ సెరికల్చర్/ ఫిషరీస్
నాలుగేండ్ల డిగ్రీ చదివి ఉండాలి.
లా ఆఫీసర్(స్కేల్-I)
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా(ఎల్ఎల్బీ)తోపాటు బార్ కౌన్సిల్లో అడ్వకేట్‌గా ఎన్రోల్ అయి ఉండాలి.
రాజ్య భాషా అధికారి
గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదవడంతోపాటు హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులుగా చదవడంతోపాటు సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు.
హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I)
డిగ్రీ, రెండేండ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్/ ఇండస్ట్రీయల్ రిలేషన్స్/హెచ్ఆర్/హెచ్ఆర్డీ/ సోషల్ వర్క్/ లేబర్ లాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-I)
గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేండ్ల మల్టీ మీడియా మెసెజింగ్ సర్వీస్ మార్కెటింగ్ లేదా ఎంబీఏ
(మార్కెటింగ్) లేదా మార్కెటింగ్ స్పెషలైజేషన్‌లో పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి.( 1995, జులై 2 నాటికి ముందు గాని 2005, జులై 1 తర్వాత గాని జన్మించి ఉండకూడదు.) నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్
ఇది కేవలం క్వాలిఫయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను తుది మెరిట్లో కలపరు. లా ఆఫీసర్, రాజ్యభాష అధికారి పోస్టులకు ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వేర్వేరుగా ఉంటుంది. లా ఆఫీసర్, రాజ్యభాష అధికారి పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, బ్యాంకింగ్ రంగంపై జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు, 25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు, 50 మార్కులకు మొత్తం 150 ప్రశ్నలకుగాను 125 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 వంతు మార్కులు కోత విధిస్తారు. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు, 25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, క్వాంటిటీవ్ ఆప్టిట్యుడ్ నుంచి 50 ప్రశ్నలు, 50 మార్కులకు మొత్తం 150 ప్రశ్నలకుగాను 125 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మెయిన్స్ ఎగ్జామినేషన్
ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, లా ఆఫీసర్ పోస్టులకు మెయిన్స్‌లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ పై 60 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటుంది. 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. రాజ్య భాషా అధికారి పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్(ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ (ఆబ్జెక్టివ్) నుంచి 45 ప్రశ్నలు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ (డిస్క్రిప్టివ్) నుంచి 2 ప్రశ్నలు మొత్తం 60 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్‌లో ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
ముఖ్యమైన వివరాలు
అప్లికేషన్లు ప్రారంభం: జులై 01.
లాస్ట్ డేట్: జులై 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175. ఇతర అభ్యర్థులకు రూ.850.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ ఎగ్జామ్: 2025, ఆగస్ట్.
ప్రిలిమ్స్ రిజల్ట్స్: 2025, సెప్టెంబర్
మెయిన్స్ ఎగ్జామ్: 2025, నవంబర్.
పర్సనల్ ఇంటర్వ్యూ: 2025, డిసెంబర్/ 2026, జనవరి. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ఇంటర్వ్యూ
ప్రతి అభ్యర్థి ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో కటాఫ్ స్కోరును సాధించాలి. ఉద్యోగ ఖాళీల సంఖ్యను అనుసరించి కటాఫ్‌ను ఐబీపీఎస్ నిర్ణయిస్తుంది.అంతేకాకుండా మెయిన్స్‌లో మెరుగైన స్కోరును సాధించిన వారినే ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో 40 శాతం మార్కులు కనీస క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస క్వాలిఫయింగ్ మార్కులు సాధించిన అభ్యర్థులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.