రైట్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు.. బిటెక్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

రైట్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు.. బిటెక్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్​) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

పోస్టులు: 40 (మేనేజర్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 07.

లాస్ట్ డేట్: నవంబర్ 30.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష: రాత పరీక్షలో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. నెగెటివ్ మార్కులు లేవు. కనీస అర్హత సాధించాలంటే అన్ రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 45 శాతం సాధిస్తే సరిపోతుంది. ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 1: 6 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.  

పూర్తి వివరాలకు rites.com వెబ్​సైట్​లో సంప్రదించగలరు.