
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీర మల్లు మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ తన మార్క్ చూపించాడు.. ఫ్యాన్స్ కు ట్రైలర్ కిక్ ఇచ్చింది. డైలాగ్స్ అద్దిరిపోయాయి. చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ కథలో.. హిందూ జాతిపై జరిగిన దాడిని ఎదిరించిన ధీరుడిగా పవన్ కల్యాణ్ కనిపించాడు. ట్రైలర్ చూస్తుంటే మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. డైలాగ్స్ అయితే మరో లెవల్ లో ఉన్నాయి.
ఓ వీరుడి కోసం ప్రకృతి పురుడుపోసుకుంటున్న సమయం అంటూ పవన్ కల్యాణ్ ఎలివేషన్ డైలాగ్స్ ఉన్నాయి.
నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు.. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారంటూ డైలాగ్ మాస్ గా ఉంది
వినాలి.. వీర మల్లు చెప్పింది వినాలి అనే డైలాగ్ డెలివరీ.. పవర్ స్టార్ మార్క్ గా ఉంది
ఇప్పుడిదాకా మేకలను తినే పులులను చూసుంటారు.. ఇప్పుడు పులులను వేలాడే బెబ్బులిను చూస్తారు అనే డైలాగ్ పవన్ కల్యాణ్ రేంజ్ లో ఉంది.
జూలై 24వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా హరి హర వీర మల్లు మూవీ రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించింది యూనిట్
ట్వి్స్ట్ ఏంటంటే.. ఇది పార్ట్ 1 మాత్రమే.. ఈ మూవీ పార్ట్ 2 కూడా ఉంటుందని రివీల్ చేసింది యూనిట్.
జూలై 24వ తేదీ పవన్ స్టార్ పవన్ ఫ్యాన్స్ పండుగే ఇక..
ట్రైలర్ అయితే మంచి టాక్ వచ్చింది. రిలీజ్ అయిన గంటలోనే లక్షల వ్యూస్ వచ్చాయి.