స్పెషల్ ప్రజావాణి’పై నిర్లక్ష్యం చేస్తే చర్యలు : కలెక్టర్ విజయేందిర బోయి

స్పెషల్ ప్రజావాణి’పై నిర్లక్ష్యం చేస్తే చర్యలు :  కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వృద్ధులు, దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. బుధవారం మహబూబ్​నగర్​ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన స్పెషల్  ప్రజావాణికి హాజరై, వృద్ధులు, దివ్యాంగులు 19 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గతంలో వచ్చిన ఫిర్యాదుల వివరాలను డీడబ్ల్యూవో జరీనా బేగం తెలిపారు. 

సీనియర్ సిటిజన్స్​ఫోరం అధ్యక్షుడు జగపతిరావు కలెక్టరేట్​లో సమాచార, సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని, కలెక్టరేట్​ఎదుట బస్ షెల్టర్ నిర్మించాలని, స్థానిక పద్మావతి కాలనీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇరుకుగా ఉందని, మరోచోటుకు మార్చాలని వినతి పత్రం అందించారు. మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, తహసీల్దార్ ఘాన్సీరాం, ఆర్టీసీ డీఎం సుజాత పాల్గొన్నారు.  

ఆయిల్ పామ్​టార్గెట్ కంప్లీట్ చేయండి

ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన 1,500 ఎకరాల్లో ఆయిల్​పామ్​సాగు టార్గెట్ ను కంప్లీట్ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్ లో ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులతో రివ్యూ చేశారు. ఇప్పటివరకు 438.50 ఎకరాలకు సంబంధించి అనుమతులు వచ్చాయని, వీటిలో 55 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లు తెలిపారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా కంది విత్తనాల మినీ కిట్స్ ను రైతులకు పంపిణీ చేశారు. ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్​ రామలక్ష్మి, జిల్లా ఉద్యాన అధికారి కె.వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేశ్, ఏవోలు, ఏఈవోలు, ప్రీ యూనిక్యూ ఆయిల్ పామ్ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు.