కొల్లాపూర్ నియోజకవర్గంలో జర్నలిస్టుల దీక్షకు మద్దతుగా సంతకాల సేకరణ

కొల్లాపూర్ నియోజకవర్గంలో జర్నలిస్టుల దీక్షకు మద్దతుగా సంతకాల సేకరణ

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్ష బుధవారం ఎనిమిదో రోజుకు చేరింది. దీక్షకు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం సరికాదని వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు అన్నారు. 

ఈ విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు రామచందర్, కన్వీనర్ జలకం మద్దిలేటి, సీనియర్ జర్నలిస్టులు కురుమయ్య, సీపీ.నాయుడు, గోవింద్, కేశవులు, సురేందర్, మల్లేశ్, రామకృష్ణ, తరుణ్ తదితరులున్నారు.