జూలై నెలలో జపాన్ దేశానికి ప్రళయం రాబోతుందా..? : బాబా వంగా జ్యోతిష్యం చెబుతున్నది ఏంటీ.

జూలై నెలలో జపాన్ దేశానికి ప్రళయం రాబోతుందా..? :  బాబా వంగా జ్యోతిష్యం చెబుతున్నది ఏంటీ.

ప్రపంచంలో భవిష్యత్తులో జరిగే సంఘటనలు జ్యోతిష్య నిపుణులు అంచనావేస్తుంటారు.  బాబా వంగా కాలఙ్ఞానం చాలా ఫేమస్​ అయింది.  ఈ  ఏడాది (2025) జులై 5న జపాన్​ లో  భయంకరమైన విపత్తులు ఏర్పడే అవకాశం ఉందని  ఆదేశానికి చెందిన న్యూ వంగా బాబా ది ఫ్యూచర్ ఐసా బుక్​ లో తెలిపారు. 

 ప్రపంచ చరిత్రలోనే 2025 జులై 5  ఇది ఒక భయంకరమైన తేదీగా నిలిచిపోబోతుందా? ఆ రోజు సునామీ వచ్చి వేల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోబోతున్నారా ..? అల్లకల్లోలంగా ప్రపంచం మారిపోబోతుందా..?  అంటే ఎస్ అనే సమాధానమే వినిపిస్తుంది .  నిజంగానే జపాన్ బాబా వంగ రాసినట్లు నిజమైతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి ..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు 
 
జపాన్​ కు చెందిన న్యూబాబా వంగా ప్రిడిక్షన్​ ప్రకారం ఈ ఏడాది ( 2025)  జూలైలో ఒక విపత్తు రాబోతుందని...  జపాన్ - .. ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర  గర్భంలో చీలిక ఏర్పడుతుందని అంచనా వేశారు. ఈ మహా ప్రళయంలో ఒకరు కాదు ...ఇద్దరు కాదు.. . కోట్లాదిమంది ఈ సునామీలో మరణిస్తారట .   మరో విషయం కూడా ఆబుక్​ లో రాశారు.  జపాన్​ దేశం ప్రపంచపటంలో ఉండదని తెలిపారు.  ఇప్పుడు ఇదే విషయాన్ని జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు .. 

జపాన్ దేశానికి చెందిన ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్ కీని  జపాన్ బాబా వంగగా పిలుస్తూ ఉంటారు జనాలు . ఈ జపాన్ బాబా వంగ కొమిక్ పుస్తకం ...ది ఫ్యూచర్ ఐసా లో...  జులై లో జపాన్ లో భారీ సునామీ రాబోతుంది అని రాసుకొచ్చారు . ఈ బుక్ 1999లో మొదటిసారి పబ్లిష్ అయింది . అందులో రియో అనేక భవిష్యత్తు సంఘటనలు తన దివ్యదృష్టితో చూసినట్లు తెలుపుతూ రాశారు . ప్రారంభంలో ఈమెకి పెద్దగా పాపులారిటి లేకపోయినా ..ఆ  తర్వాత ఆమె చెప్పిన విషయాలు కొన్ని నిజం కావడంతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది .

 ఈ వార్త విన్న జపాన్​ పర్యాటకులు  టూర్​ ను వాయిదా వేసుకున్నారు. ఫ్లైట్​ టికెట్లు... టూర్​ కు సంబంధించిన ప్యాకేజీలను రద్దు చేసుకుంటున్నారు.  ఈ వార్త వైరల్​ అయిన దగ్గర నుంచి జపాన్​ కు రావలసిన బుకింగ్స్​ లో 50 శాతం తగ్గిందని జపాన్​ ప్రభుత్వం ప్రకటించింది. 

2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం ..  ఫుకుషిమా దైచి అణు విపత్తు గురించి గతంలోనే అంచనావేశారు. అయితు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా జపాన్​ వంగాబాబా టాక్స్​కీ చెప్పిన విషయాలపై జనాలు దృష్టి సారించారు. 

రియో టాట్సుకి అంచనాలు పూర్తిగా నిరాధారమైనవని...  శాస్త్రీయ ఆధారం లేదని  జపాన్ అధికారులు చెప్పినప్పటికీ... భూకంప ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారు. జపాన్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని  ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఏప్రిల్‌లో హెచ్చరించింది, 

జపాన్​ వంగా బాబా నిజమైన అంచనాలు:

  • 1995 కోబ్ భూకంపం: టాట్సుకి ఈ వినాశకరమైన భూకంపం 
  • 2011 తోహోకు భూకంపం మరియు సునామీ: 22వేల  మందికి పైగా మరణం 
  •  కోవిడ్-19 మహమ్మారి: టాట్సుకి రాసిన పుస్తకం ...ది ఫ్యూచర్ ఐ సాలో  2020లో వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరిక
  • ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం: ఆమె క్వీన్ లెజెండ్ మరణం 

ఆమె చెప్పిన అంచనాలు...ది ఫ్యూచర్ ఐ సాలో పేర్కొన్న విషయాలు వాస్తవం కావడంతో పర్యాటకులు  జపాన్ టూర్ ని కూడా వాయిదా వేసుకుంటున్నారు.  ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు జపాన్ కి టూర్ కి ప్యాకేజీలు బుక్ చేసుకుని చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు.  జపాన్ కు రావాల్సిన బుకింగ్ లో 50% తగ్గినట్లు జపాన్ గవర్నమెంట్ ప్రకటించింది..!