ఇండోనేషియాలో పడవ ప్రమాదం..30మంది గల్లంతు..నలుగురు మృతి

ఇండోనేషియాలో పడవ ప్రమాదం..30మంది గల్లంతు..నలుగురు మృతి

ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గురువారం( జూలై3) ఇండోనేషియాలోని బాలికి రిసార్ట్ ద్వీపానికి వెళ్తున్న 65మందితో వెళ్తున్న పడవ మునిగి నలుగరు చనిపోయారు. డజన్లకొద్ది మంది గల్లంతయ్యారు. 

ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపమైన జావాలోని బన్యువాంగినుంచి బయలుదేరిన పడవ  ప్రసిద్ధ హాలిడే దీవికి ఉత్తరాన ఉన్న ఓడరేవుకు ప్రయాణిస్తుండగా బుధవారం అర్ధరాత్రి బాలి జలసంధిలో మునిగిపోయింది. 

స్థానిక పోలీసులు సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో పడవలో 53 మంది ప్రయాణికులు,12 మంది సిబ్బందితో పాటు 22 వాహనాలు ఉన్నారు. వారిలో నలుగురు చనిపోయారు. 31మందిని రెస్క్యూ టీంలు సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. మరో 30మంది గల్లంతయ్యారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

ప్రమాదంలో గల్లంతయిన 30మందికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు టగ్ బోట్లు, రెండు గాలితో కూడిన పడవలు సహా తొమ్మిది పడవలతో  తప్పిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. రాత్రిపూట సముద్ర అలలు 2 మీటర్ల ఎత్తు వరకు ఎగిపిడుతుండటంలో సహాయక చర్యలు కొంత ఆటంకం ఏర్పడింది. ప్రాణాలతో బయటపడిన వారిలో నలుగురు ఫెర్రీ లైఫ్ బోట్ ఉపయోగించి తమను తాము రక్షించుకున్నారని ,గురువారం తెల్లవారుజామున ఒడ్డుకు చేరుకున్నట్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది.

దాదాపు 17వేల దీవులతో కూడిన ఇండోనేషియాలో సముద్ర ప్రమాదాలు తరుచుగా సంభవిస్తుంటాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం,కొన్నిసార్లు చెడు వాతావరణం కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయని రెస్క్యూ ఏజెన్సీలు చెబుతున్నాయి. 

2025 మార్చిలో బాలి సమీపంలో 16 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడి ఆస్ట్రేలియన్ మహిళ మరణించగా, కనీసం ఒకరు గాయపడ్డారు. 2018లో సుమత్రా ద్వీపంలోని ప్రపంచంలోని లోతైన సరస్సులో  ఫెర్రీ మునిగిపోవడంతో 150 మందికి పైగా గల్లంతయ్యారు. 

బుధవారం అర్థరాత్రి బాలి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో గల్లంతయిన 30మందికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.