ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఢిల్లీనుంచి వాషింగ్టన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో వియన్నా ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. దీంతో టూర్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి వాషింగ్టన్ ప్రయాణాన్ని రద్దు చేశారు.

షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండయా AI103 విమానం ఇంధనం నింపుకునేందుకు వియన్నా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. సాధారణ విమాన తనిఖీల్లో  సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. వాషింగ్టన్‌కు ప్రయాణం రద్దు చేసి ప్రయాణీకులను వియన్నాలో దింపారు.

ఎయిర్ ఇండియా AI103 విమానం  రద్దు కావడంతో వాషింగ్టన్ డిసి నుంచి వియన్నా మీదుగా ఢిల్లీకి వెళ్లాల్సిన AI104 విమానం కూడా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఢిల్లీకి ప్రత్యామ్నాయ విమానాలలో తిరిగి బుక్ చేసుకున్నారు.