
కందనూలు వెలుగు: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి చెప్పారు. బుధవారం బిజినేపల్లి మండలం పాలెంలో ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి, తిరుపతయ్య, నజీర్, రాములు, పరశురాములు, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.
ఆహార భద్రత మిషన్ మినీ కిట్స్ పంపిణీ
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగనుల్ రైతు వేదికలో ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి బుధవారం జాతీయ ఆహార భద్రత మిషన్ మినీ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంది పంటకు సంబంధించి ప్రభుత్వం విత్తనాలను సబ్సిడీపై ఇస్తోందని, రైతులు విరివిగా సాగు చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ, సీసీరోడ్లకు శంకుస్థాపన చేశారు. కొత్త బోర్ను ప్రారంభించారు. సింగల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, అధికారులున్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
వంగూరు, వెలుగు: చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లిలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లకు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని జైపాల్ భూమిపూజ చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇండ్ల ప్రొసీడింగ్స్ అందించారు. పార్టీ మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
గద్వాల టౌన్, వెలుగు: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ఆఫీస్లో గద్వాల మండల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరవగా వాటిలో గద్వాల మండలానికి 303 కేటాయించినట్లు పేర్కొన్నారు. నాయకులు సుభాన్, బండారి భాస్కర్, గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, రమేశ్ నాయుడు, ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.