తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థికసాయం : కలెక్టర్ పమేలా సత్పతి

 తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థికసాయం  : కలెక్టర్ పమేలా సత్పతి
  • కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: కొవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. జిల్లాలో కరోనాతో ఏడుగురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోగా పీఎం కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా వారికి వారికి 18 ఏండ్లు వచ్చేవరకు రూ.10లక్షలు వచ్చేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో నలుగురికి 18 ఏండ్లు పూర్తికాగా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం వారికి బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆరోగ్య కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టపడి చదివి జీవితంలో ఎదగాలని సూచించారు. 

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి డీడబ్ల్యూఓ సబిత, సీడబ్ల్యూసీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధనలక్ష్మి, డీసీపీవో పర్వీన్ పాల్గొన్నారు. అంతకుముందు సిటీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ మేయర్ సునీల్ రావు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నరలో సిటీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు.