
ఆదిలాబాద్టౌన్, వెలుగు : కులం పేరుతో దూషించిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... బేల మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన కనక మారుతిని 2023లో అదే గ్రామానికి చెందిన బండేకర్ సాకారం, శంకర్, మంగేశ్, తేజస్, మంగళి కులం పేరుతో దూషించారు.
ఆయన బేల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు ఒక్కొక్కరికి రూ. 500 జరిమానాతో పాటు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైజన్ ఆఫీసర్ జి. పండరి తెలిపారు.