సింగరేణిలోని 5 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్

సింగరేణిలోని 5 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్
  • అవార్డులు స్వీకరించిన సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బొగ్గు గనుల శాఖ సింగరేణిలోని 5 బొగ్గు గనులకు ఫైవ్​స్టార్​రేటింగ్ ఇచ్చింది. 2024-–25 ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో ఈ అవార్దులను ప్రకటించింది. సింగరేణి తరపున శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌‌‌‌‌‌‌‌కేఎన్‌‌‌‌‌‌‌‌టీ, ఆర్‌‌‌‌‌‌‌‌కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరీగూఢ ఓసీ, రామగుండం-3కి చెందిన ఆర్‌‌‌‌‌‌‌‌జీ ఓసీ-1 గనులు ఈ​అవార్డులను దక్కించుకున్నాయి.

ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ లోని రాయ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా సింగరేణి సంస్థ సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతీ ఏటా దేశంలో అత్యుత్తమ బొగ్గు గనులకు స్టార్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను ఇస్తుంది. అత్యుత్తమ స్టార్ రేటింగ్ సాధించిన గనుల యాజమాన్యాలను అభినందిస్తూ అవార్డులను అందిస్తూ ఉంటారు.

స్టార్ రేటింగ్ కోసం బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పి 100 మార్కులకు గానూ 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు.