
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని ఆర్కే– -5 బొగ్గు గని వద్ద సెక్యూరిటీ గార్డులపై రాళ్లతో దాడికి పాల్పడిన ఐదుగురు దొంగలను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్కే-–5 బొగ్గు గనిపై విలువైన ఇనుప స్క్రాప్, కాపర్‌వైర్లు, ఇతర సామగ్రి కాపల కోసం ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు రెండోషిప్టు డ్యూటీలో ఉన్నారు. సోమవారం రాత్రి 10గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి రాగా సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో రాళ్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన గార్డులు ఫోన్ లో ఎంటీఎప్, ఏసీటీసీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెళ్లి ముగ్గురు దొంగలను పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారు. పట్టుకునే క్రమంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు బర్ల మధుకర్, మోట్కూరి కుమార్, కుర్మ వెంకట్ కు గాయాలయ్యాయి.
మంగళవారం ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన మందమర్రికి చెందిన ధనకుంట్ల పవన్, ధనకుంట్ల మునియప్ప, గుర్రాల భూమయ్య, జన్నే నరేంద్ర, భీమాండ్ల శివపై శ్రీరాంపూర్ కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్టు ఎస్ఐ మేకల సంతోష్‌కుమార్ తెలిపారు. స్క్రాప్చోరీకి కాకుండా కాపాడిన గార్డులు,సెక్యూరిటీ సిబ్బందిని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్, సీనియర్సెక్యూరిటీ ఆఫీసర్ జక్కారెడ్డి అభినందించారు.