గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ పరిధిలో ఐదుగురు మహిళలు దొంగతనానికి పాల్పడ్డారు. హైదర్‌గూడ న్యూఫ్రెండ్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోని వైర్లను దొంగలించి పారిపోయారు. వీరంతా ఆటోలో వచ్చి వైర్లను దొంగతనం చేసి వెళ్తున్నట్లు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. రూ.4 లక్షల వైర్లు చోరీకి గురైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఇంట్లో గత నెల 21న సైతం ఇలాగే దొంగతనం జరిగిందని, అప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు.
