
హైదరాబాద్‌కు చెందిన 5 ఏళ్ల బాలుడు టైక్వాండోలో గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాడు. టైక్వాండోలో ఆష్మాన్ తనేజా అనే బాలుడు నాన్ స్టాప్‌గా గంటలో అత్యధికంగా నీ స్ట్రయిక్స్ కొట్టి ఈ ఘనత సాధించాడు. అష్మాన్ తనేజా చాలా చిన్న వయస్సులో ఈ ఫీట్ సాధించిన టైక్వాండో అథ్లెట్. తనేజా USA వరల్డ్ ఓపెన్ టైక్వాండో సిల్వర్ పతక విజేత. తనేజా ఒక గంటలో నాన్‌స్టాప్‌గా 1200 కన్నా ఎక్కువ నీ స్ట్రయిక్స్ కొట్టి ఈ రికార్డును సాధించాడు.
ఆష్మాన్ తనేజా తండ్రి ఆశిష్ తనేజా మాట్లాడుతూ.. ‘నా కొడుకు ప్రపంచ రికార్డు కోసం చాలా ప్రాక్టీస్ చేశాడు. ఆష్మాన్ తన అక్క నుండి ప్రేరణ పొంది దీనిలో శిక్షణ ప్రారంభించాడు. టైక్వాండోలో ఈ రికార్డును సాధించిన చిన్న వయసు బాలుడిగా ఆష్మాన్ ఈ ఘనత సాధించాడు. నా కొడుకు ఇప్పుడు మరో గిన్నిస్ రికార్డు కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందులో కూడా ఆష్మాన్ విజయం సాధిస్తాడని ఆశిస్తున్నాం’అని తెలిపాడు.
ఈ రికార్డు సాధించడం పట్ల ఆష్మాన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఆష్మాన్ అక్క కూడా టైక్వాండో ప్లేయర్. తన అక్కకి రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు రావడంతో, తాను కూడా ఆ ఘనత సాధించాలని అనుకున్నట్లు ఆష్మాన్ తెలిపాడు. తన అక్కే తనకు ప్రేరణ మరియు గురువు అని ఆష్మాన్ తెలిపాడు. ఈ రికార్డును తన అక్కకు అంకితమిస్తున్నట్లు ఆష్మాన్ తెలిపాడు.