
ప్రపంచ వ్యాప్తంగా OTT ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంచలన వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్ '( Squid Game) . థ్రిల్లింగ్ కథనంతో ఇప్పటికే మూడు భాగాలుగా వచ్చి వీపరీతంగా ఆకట్టుకుంది. ఓటీటీ ఆడియన్స్ కు సరికొత్త వినాదాన్ని పంచింది. అంతలా అలరించిన ఈ సిరీస్ స్పూర్తితో మన సినీతారలు, 'స్క్విడ్ గేమ్' అడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఏఐతో క్రియేట్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ జాబితాలో మన నటసింహం నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ), నటి అనసూయ ( Anasuya ), నటుడు రాజీవ్ కనకాల ( Rajeev Kanakala )వచ్చి చేరారు. ఈ ముగ్గురూ కలిసి 'స్క్విడ్‌గేమ్' ఆడినట్టుగా రూపొందించిన AI వీడియో ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
అంబరిల్లా ఎపిసోడ్‌లో బాలయ్య మార్క్!
ఈ నవ్వుల పువ్వులు పూయించే వీడియో ‘స్క్విడ్‌గేమ్1’లోని అత్యంత ఆసక్తికరమైన ఎపిసోడ్ ‘ది మ్యాన్ విత్ ది అంబరిల్లా’ ఆధారంగా రూపొందించబడింది. ఈ గేమ్‌లో వివిధ ఆకారాల్లో తయారు చేసిన గట్టి స్వీట్ఉంటుంది. ఆటగాళ్లు ఆ స్వీట్‌ను విరగకుండా, దానిపై ఉన్న ఆకారాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి. ఈ వీడియోలో అనసూయకు త్రిభుజాకారం రాగా, ఆమె సునాయాసంగా దాన్ని బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, రాజీవ్ కనకాల మాత్రం ఈ ప్రయత్నంలో విఫలమయ్యారు. దీంతో గేమ్ నిర్వాహకులు ఆయన్ను గేమ్ నుంచి బయటకు తీసుకెళ్లిపోతారు.
బాలయ్య విశ్వరూపం!
ఇక అసలు మలుపు బాలకృష్ణ వంతు వచ్చినప్పుడే మొదలవుతుంది! బాలయ్యకు కూడా ఒక ఆకారం వస్తుంది. ఆయన ఎంతో ప్రయత్నించినా ఆ స్వీట్ నుంచి ఆకారం బయటకు రాదు. దీంతో నందమూరి అభిమానులు ఊహించినట్టే బాలయ్యకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆటలోని నిబంధనలను పక్కనపెట్టి, ఆ స్వీట్‌ను కోపంగా తినేస్తారు. ఇది చూసిన గేమ్ నిర్వాహకులు బాలకృష్ణను పట్టుకోవడానికి వస్తారు. అక్కడే అసలు వినోదం మొదలవుతుంది! గేమ్ నిర్వాహకులను బాలయ్య బాబు చితగ్గొట్టి, విసిరి అవతల పడేసే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ సీన్ బాలయ్య నటిస్తున్న అఖండ 2 మూవీలోని పైట్ సీన్ రీ క్రియేట్ చేశారు. ఒక్క దెబ్బకి అందరిని పైకి విసిరివేసే సన్నివేశం గుర్తుకు వస్తుంది.
— Out of Context Telugu (@OutOfContextTel) July 17, 2025
వీడియో చివరిలో ‘జై బాలయ్య’ అంటూ ఎన్టీఆర్ వాయిస్‌తో వినిపించే నినాదం అభిమానులకు మరింత కిక్కిచ్చింది. 'స్క్విడ్‌గేమ్' సిరీస్‌లో హీరో నంబర్ 456 కాగా, ఈ AI వీడియోలో బాలకృష్ణ కూడా ప్లేయర్ నెం. 456 గా కనిపించడం మరింత ఆసక్తికరంగా మారింది.