Vitality Blast: ఎత్తుకు పై ఎత్తు అంటే ఇదే: స్కూప్ షాట్ ఆడబోయి స్విచ్ షాట్ ఆడిన హోల్‌మాన్

Vitality Blast: ఎత్తుకు పై ఎత్తు అంటే ఇదే: స్కూప్ షాట్ ఆడబోయి స్విచ్ షాట్ ఆడిన హోల్‌మాన్

వైటాలిటీ టీ20 బ్లాస్ట్ లో భాగంగా బుధవారం (జూలై 16) మిడిలెసెక్స్, సర్రే మధ్య మ్యాచ్ జరిగింది. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మిడిలెసెక్స్ పై సర్రే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోటా పోటీగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడినా సర్రేకే గెలుపు వరించింది. ఈ మ్యాచ్ లో ఒక వింత షాట్ నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  మిడిల్‌సెక్స్ బ్యాటర్ ల్యూక్ హోల్‌మాన్ ఆడిన ఒక విచిత్ర షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

190 పరుగుల ఛేజింగ్ లో సర్రే కెప్టెన్ సామ్ కుర్రాన్‌ బౌలింగ్ లో హోల్‌మాన్ మొదట స్కూప్ షాట్ ఆడదామని ప్రయత్నించాడు. ఇది గమనించిన సామ్ కరణ్ తన బౌలింగ్ కు మార్చుకుంటూ స్లో డెలివరీ వేశాడు. అంతలోనే స్లో బాల్ ను పసిగట్టిన హోల్‌మాన్ అంతలోనే  తన షాట్ మార్చుకొని బ్యాట్ రివర్స్ చేసి రివర్స్ స్వీప్ ఆడాడు. అంతేకాదు స్వీప్ షాట్ ఆడి బంతిని బౌండరీ కూడా తరలించడం విశేషం. ఇప్పటివరకు క్రికెట్ లో ఇలాంటి షాట్ చూడలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఈ షాట్ కు ఏ పేరు పెట్టాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు.
 

మొదట బ్యాటింగ్ చేసిన సర్రే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ జాక్స్ 36 బంతుల్లో రెండు సిక్సర్లు  ఐదు ఫోర్లతో 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆల్ రౌండర్ టామ్ కుర్రాన్ ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 22 బంతుల్లో 47 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. మిడిల్‌సెక్స్ బౌలర్లలో పేసర్ ర్యాన్ హిగ్గిన్స్ 4 వికెట్లతో రాణించాడు. ఛేజింగ్ లో మిడిల్‌సెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టీఫెన్ ఎస్కినాజీ (38 బంతుల్లో 53) హాఫ్ సెంచరీకి తోడు హిగ్గిన్స్, ల్యూక్ హోల్‌మాన్ ఏడో వికెట్‌కు కేవలం 29 బంతుల్లో 62 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.