స్కూల్లో 9 ఏళ్ల బాలిక ఘోరం.. టిఫిన్ బాక్స్ తెరిచేలోపే.. గుండెపోటుతో మృతి ?

స్కూల్లో 9 ఏళ్ల బాలిక ఘోరం.. టిఫిన్ బాక్స్ తెరిచేలోపే.. గుండెపోటుతో మృతి ?

రాజస్థాన్ రాష్ట్రంలోని దంతా నగరంలో 4వ తరగతి చదువుతున్న తొమ్మిది ఏళ్ల  ప్రాచి కుమావత్ ఊహించని పరిస్థితిలో చనిపోయింది.  గత మంగళవారం ఉదయం లంచ్ సమయంలో భోజనానికి కూర్చున్న ప్రాచి టిఫిన్ తెరిచేలోపే స్పృహ తప్పి పడిపోయింది.

దింతో స్కూల్ టీచర్లు ఆమెను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. మొదట అక్కడి వైద్యులు ఆమెను బతికించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించామని, ఆమెకు పల్స్ లేదు, బిపి పడిపోయింది, ఊపిరి కూడా అందటం  లేదు, గుండె ఆగిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయని తరువాత కుటుంబ సభ్యులు ఆమెను సికార్‌లోని ఓ ఆసుపత్రికితీసుకెళ్లినట్లు చెప్పారు. 

"ఆమెను బతికించడానికి మా వంతు కృషి చేసాము, కానీ ఆమె పరిస్థితి చేజారుతుండటంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి సికార్‌లోని ఆసుపత్రికి రిఫర్ చేసాము. ఇలాంటి సమయంలో పేషంటుని తీసుకురావడంలో ఆలస్యం జరిగితే ప్రజలు వెంటనే CPR ఇవ్వాలి. పిల్లలలో ఇలా ఉండటం చాలా అరుదైన కేసు. కొన్నిసార్లు పుట్టుకతో వచ్చే గుండె జబ్బు లేదా  మరేదైనా సమస్య ఉండొచ్చు,  తల్లిదండ్రులు కూడా వాటిని గమనించి ఉండకపోవచ్చు" అని డాక్టర్  అన్నారు.

ALSO READ : నర్సింగ్ గ్రేడ్-1 ప్రమోషన్లలో గందరగోళం..సీనియర్లకు అన్యాయం జరిగిందని ఆరోపణ

ప్రాచి గత రెండు, మూడు రోజులుగా జలుబు కారణంగా స్కూలుకు రావట్లేదని ఆమె స్కూల్  ప్రిన్సిపాల్ చెప్పారు. కానీ సోమవారం ఆమె స్కూల్ వచ్చాక  ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించింది, ఉదయం ప్రేయర్లో కూడా పాల్గొంది, అయితే లంచ్ సమయంలో  స్పృహ కోల్పోయింది అని అన్నారు.  

ప్రాసి మృతి చెందినట్లు తెలియగా తీవ్ర నిరాశకు గురైన ఆ కుటుంబం ఆమెను అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకువెళ్లింది. పోస్టుమార్టం నిర్వహించలేదు.

"పోస్ట్‌మార్టం లేకుండా ఆమె గుండెపోటుతో మరణించిందని ఖచ్చితంగా చెప్పలేరు. ఆమెకు ఖచ్చితంగా గుండెపోటు వచ్చినట్లు అనిపించింది. ఆమెకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బు ఉండి ఉండవచ్చు, అది బయటపడలేదు లేదా మరేదైనా పరిస్థితి కారణంగా అకస్మాత్తుగా అది తీవ్రమై ఉండవచ్చు" అని డాక్టర్ చెప్పారు.

స్కూల్లో రికార్డయిన వీడియోలో ప్రాచి నవ్వుతూ కనిపించింది. ప్రాచికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆమె ఆకస్మిక మరణం మమ్మల్ని  దిగ్భ్రాంతికి గురి చేసిందని కుటుంబ సభ్యలు తెలిపారు.