
కరీంనగర్ రూరల్, వెలుగు: ఆగస్టు నెలలో నాందేడ్ నుంచి వయా జగిత్యాల, కరీంనగర్ మీదుగా తిరుపతికి మరో రైలు అందుబాటులోకి వస్తుందని రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం, ఆదివారం మాత్రమే ట్రైన్సౌకర్యం ఉంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా మరో రోజు తిరుపతికి ట్రైన్నడిపించేందుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 2 నుంచి నడిచే కొత్త ట్రైన్నాందేడ్లో సాయంత్రం 4.50 గంటలకు బయలు దేరుతుంది.
జగిత్యాల స్టేషన్లో రాత్రి 8.40 గంటలకు, కరీంనగర్లో రాత్రి 9.40 గంటలకు, పెద్దపల్లిలో 10.05 గంటలకు, జమ్మికుంట, వరంగల్ మీదుగా ఆదివారం ఉదయం11.30 తిరుపతికి చేరుతుంది. మళ్లీ ఆదివారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు నాందేడ్‌కు చేరుతుంది. నాందేడ్ నుంచి ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో తిరుపతికి, మరునాడు తిరిగి నాందేకు వెళ్తుందని రైల్వేశాఖ పేర్కొంది. కొత్త రైలును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.