
జగద్గిరిగుట్ట పీఎస్పరిధిలో ఘటన
ఇంట్లో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికకు చాక్లెట్ కొనిస్తానని ఆశపెట్టి నలభై ఏండ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్పరిధిలో జరిగింది. ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్ లో మహిపాల్ రెడ్డి కుటుంబంతో కలిసి తన అన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శనివారం స్థానికంగా ఉంటున్న ఐదేళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి అతను ఉంటున్న భవనం మూడో అంతస్థు పైకి తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు పైకి వెళ్లి చూడగా మహిపాల్బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. స్థానికులను చూసిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సాయంత్రం కాలనీవాసులకు మహిపాల్ రెడ్డి కనపడటంతో పట్టుకుని చితకబాదారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కింద పడటంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.