తెలంగాణలో ముంచెత్తుతున్న వరదలు: పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు.. ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్స్..

తెలంగాణలో ముంచెత్తుతున్న వరదలు: పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు.. ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్స్..

గత 24 గంటల్లో వర్షాలు తెలంగాణలో అన్ని జిల్లాలను అతలాకుతలం చేసింది. ఒక వైపు రోడ్లు నీట మునిగి ఎక్కడికక్కడ రవాణా నిచిపోగా, పలు గ్రామాల్లో ఇల్లులు మునిగిపోయాయి. వీరిని సహాయక బృందాలు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వరదల తాకిడి కారణంగా మేడ్చల్-నిజామాబాద్ సెక్షన్‌లోని భిక్నూర్-తాడ్మడ్ల అలాగే అకనాపేట్-మెదక్ సెక్షన్‌లోని రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) అత్యవసర పనులు చేపట్టింది.  

దింతో నిజామాబాద్-మేడ్చల్ మధ్య పలు రైలు సర్వీసులను రద్దు చేయగా, పాక్షికంగా మళ్లింపులు, రీషెడ్యూలింగ్ చేస్తూ  ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అధికారులు రైలు సహాయక చర్యలు చేపట్టారు. 

Also Read : వరదలో చిక్కుకున్న ప్రజలను రెస్య్కూ చేశాం

ప్రయాణికులకు రైలు సేవల స్టేటస్ తెలియజేయడానికి సికింద్రాబాద్ (040-27786170), కాచిగూడ (9063318082), నిజామాబాద్ (040-27783606 / 9703296714), కామారెడ్డి (040-27783867 / 040-27783861 / 9281035664)లలో హెల్ప్‌డెస్క్ నంబర్‌లను ఏర్పాటు చేశారు.

ఇవాళ గురువారం మెదక్-కాచిగూడ (77604), బోధన్-కాచిగూడ (57414), నిజామాబాద్-కాచిగూడ (77644) రైళ్లను రద్దు చేశారు.

ఇదిలా ఉండగా నిన్న బుధవారం రాత్రి 11.50 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరాల్సిన రైలు నంబర్ 17605 కాచిగూడ - భగత్ కి కోఠి గురువారం ఉదయం 8.30 గంటలకు తిరిగి షెడ్యూల్ చేసారు.  ఈ ట్రైన్  కాజిపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా మల్లింపు చేసారు.