వరదలో చిక్కుకున్న ప్రజలను రెస్య్కూ చేశాం.. ప్రాణ నష్టం తగ్గేలా అధికారులు పని చేశారు: మంత్రి వివేక్

వరదలో చిక్కుకున్న ప్రజలను రెస్య్కూ చేశాం.. ప్రాణ నష్టం తగ్గేలా అధికారులు పని చేశారు: మంత్రి వివేక్

హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాను కుండపోత వాన ముంచెత్తింది. రికార్డ్ స్థాయిలో వర్షం కురవడంతో మెదక్ జిల్లా జలమయమైంది. కొన్ని ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడం, వరద నీరు భారీగా చేరడంతో రోడ్లు దెబ్బ తిన్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో మెదక్‎లో వర్షం, వరద, సహయక చర్యలపై ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం (ఆగస్ట్ 28) కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. 

జిల్లాలోని ప్రస్తుత పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుకున్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలపై గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని, వరదలో చిక్కుకున్న ప్రజలను రెస్య్కూ చేశామని తెలిపారు. జిల్లాలోని అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేశామన్నారు. వరదలకు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు మొదలుపెట్టామని చెప్పారు.

Also Read : ఆదిలాబాద్ లో ఉప్పొంగిన తర్నామ్ వాగు

ప్రాణ నష్టం తగ్గేలా అధికారులు పని చేశారని అన్నారు. పోచారం ప్రాజెక్ట్‎కు వరద తగ్గడంతో ముప్పు తప్పిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇవాళ (ఆగస్ట్ 28) సీఎం రేవంత్ మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ రివ్యూ సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ కలెక్టర్ రాహల్ రాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.