చెన్నూర్ లో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

చెన్నూర్ లో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ప్రచార ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు గులాబీ నేతలు. బై బై మోడీ ట్యాగ్ లైన్ తో మంచిర్యాల జిల్లాలో భారీగా ప్లెక్సీలు పెట్టారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మెయిన్ ఏరియాల్లో , సిగ్నల్ పాయింట్ల దగ్గర కటౌట్లు ఏర్పాటు చేశారు..

హైదరాబాద్ లో జులై 2,3 న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీతో  బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హైదరాబాద్ రానున్నారు. దీంతో భాగ్యనగరాన్ని మొత్తం కమలమయం చేయాలనుకున్నారు ఆ పార్టీ నేతలు. అయితే.. బీజేపీ నేతలకంటే  ముందే టీఆర్ఎస్ పార్టీ వాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతో ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ నగరమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు

బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై  నిన్న జీహెచ్ ఎంసీ చర్యలు తీసుకుంది. బీజేపీ ఆఫీస్ బయట కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ అంటూ డిజిటల్ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ పెట్టారు.  దీనిపై అభ్యంతరం తెలుపుతూ టీఆర్ఎస్ నేతలు బల్దియాకు ఫిర్యాదు చేశారు. అటు బల్దియా అధికారులు కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నారు. బీజేపీ ఆఫీస్ బయట ఏర్పాటు చేసిన దానికి రూ.55 వేల ఫైన్ వేశారు. 

సాలు దొర- సెలవు దొర అంటూ బీజేపీ పెట్టిన హోర్డింగ్ కు కౌంటర్ గా పరేడ్ గ్రౌండ్స్ దగ్గర భారీ హోర్డింగ్ లను టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. సాలు మోడీ సంపకు మోడీ అనే స్లోగన్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 3వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. దీంతో మోడీకి వ్యతిరేకంగా ఇక్కడ హోర్డింగ్ లను టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. అయితే.. రాత్రి వెలిసిన బై బై మోడీ ఫ్లెక్సీలు బుధవారం ఉదయం కొంతమంది వ్యక్తులు తొలగించారు.